Gorantla Madhav: మరోసారి సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బెయిల్‌పై మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనతోపాటు మరో ఐదుగురు అనుచరులు విడుదలయ్యారు.
ప్రస్తు త వేసవిలో మండలంలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా విచ్చే సి మాట్లాడారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.
అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చేశారు.. ఒక్క అంగన్వాడీలకు తప్ప.. దీంతో మాకెప్పు డిస్తారు తాతయ్యా సెలవులు అంటూ చిన్నా రులు మారం చేస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎంపిక రసకందాయంలో పడింది. రేపో మాపో టీడీపీ నుంచి నామినేటెడ్ చైర్మన్ పేరు ప్రకటించడానికి అంతా సిద్ధమైందనుకున్న తరు ణంలో చివర్లో జిల్లా పేరే జాబితాలో మాయ మైపోయింది.
టీడీపీ మద్దతుని సంపాదించింది.. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీలో చైర్పర్సన్ పీఠంతోపాటు వైస్ చైర్మన్‌ను టీడీపీ దక్కించుకుంది.
కష్టేఫలి అన్నారు పెద్దలు.. ఆ మాటకు అచ్చు గుద్దినట్టు సరిపోతాడు ఈ చిత్రంలో కనిపి స్తున్న యువకుడు.. ఐఏఎస్ సాధించాలన్నది అతని కల. అయితే రెండు సార్లు తప్పినా ఒప్పుకోలేదు.. మూడో సారి ప్రయత్నించారు.. 274 ర్యాంక్ సాధించాడు.
జిల్లాలో సంస్థాగత ఎన్నికల జోరు పెరిగిం ది. టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట నేతలపై కూటమి ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడు విజృంభిస్తున్నాడు. వేసవి ప్రతాపంతో వివిధ వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు.
2019 ఎన్నికల ముందు అందరికీ ఇళ్లిస్తామంటే పేదలు నమ్మారు.. ఓటేశారు.. గెలిపించారు.. తీరా చూస్తే.. కొండలు.. గుట్టలు.. చివరికి శ్మశానాలు.. అదీ ఇదీ అని ఏముంది.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ స్థలాలు ఇచ్చేశారు.. మా పనైందని గత పాలకులు చేతులు దులుపుకున్నారు..