ఆసుపత్రి ప్రాంగణం.. వాహనాలు కొట్టేస్తాం!
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:32 AM
కాకినాడ క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌కు ప్రతి రోజు వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. వేల మంది వరకు ఆసుపత్రిలోని పలు విభాగాల వార్డుల్లో చికిత్స పొందుతుంటారు. అయితే వారి కోసం వచ్చే సంబంధీకులు కంగారులో ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి ప్రాంగణంలో
కాకినాడ జీజీహెచ్‌లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
రూ.14.50 లక్షల విలువైన వాహనాల స్వాధీనం
వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌కు ప్రతి రోజు వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. వేల మంది వరకు ఆసుపత్రిలోని పలు విభాగాల వార్డుల్లో చికిత్స పొందుతుంటారు. అయితే వారి కోసం వచ్చే సంబంధీకులు కంగారులో ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట పార్క్ చేసి చికిత్స పొందుతున్న వారి వద్ద కొంత సమయం ఉంటారు. ఆ సమయాన్ని కొం తమంది దొంగలు అదునుగా మార్చుకున్నారు. ఆసుపత్రి అనే విషయం కూడా ఆలోచించకుండా పార్కింగ్‌లో ఉన్న వాహనాలను మారు తాళాలతో చోరీ చేసి తక్కువ రేటుకు విక్రయించి జ ల్సాలు చేసుకునే ముఠాను కాకినాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్ నిందితుల వివరాలను వెల్లడించారు.
దొరికారు ఇలా...
ఇటీవల కాకినాడ జీజీహెచ్ ప్రాంగణం, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఎస్పీ బిందుమాధవ్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేర కు కాకినాడ ఎస్‌డీపీవో పాటిల్ దేవరాజ్ మనీష్ నేతృత్వంలో క్రైం సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్ సీఐ ఎం నాగదుర్గారావు బృందం ప్రత్యేక బృందాలుగా ఏ ర్పడి నిఘాను పటిష్టం చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు. ఈ క్రమంలో గురువారం పోలీసు లు పెట్రోలింగ్ చేస్తుండగా కాకినాడ కచ్చేరిపేట బ్రాందీ షాపు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో ఒకరు రంగంపేట మ ండలం రాజపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు 28 ఏళ్ల యేగి విజయ్, మరొకరు పెనుమండ్ర మండలం నెగ్గిపూడికి చెందిన పాత నేరస్తుడు 26 ఏళ్ల నీలాపు హర్షసాయి వర్ధన్, ఇంకొ కరు పెనుమండ్ర మండలం మార్టేరుకు చెందిన పాత నేరస్తుడు 22 ఏళ్ల చిర్ల జగన్‌మోహన్ రెడ్డి గా గుర్తించారు. అరెస్ట్ చేసి వారి నుంచి రూ.14. 50 లక్షల విలువైన మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
తక్కువ ధరకు కొనుగోలు...
అలాగే నేరస్తుల వద్ద తక్కువ ధరకు దొంగ బైక్‌లను కొనుగోలు చేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన సలాది బిర్లా, పెనుగొండకు చెందిన అడబాల శ్రీను, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరానికి చెందిన మేడిద సూ ర్యప్రకాశరావు, రావులపాలెనికి చెందిన సలాది శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. మొత్తం ఏడుగురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించనున్నట్టు ఎస్పీ తెలిపా రు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం ఎస్‌ఐ వినయ్‌ప్రతాప్, వన్‌టౌన్ ఎస్‌ఐ స్వామినాయుడు, క్రైం ఏఎస్‌ఐలు కొప్పిశెట్టి గోవిందరావు, ఆర్.శ్రీనివాస్, హెచ్‌సీలు కెఎస్ వర్మ, ప్రసాద్, కానిస్టేబుళ్లు బంగార్రాజు, రత్నం, రెడ్డి, అంజిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో కాకినాడ ఎస్‌డీపీవో పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్‌బీ డీఎస్పీ కెవి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.