Share News

TDP Cadres Clash: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్

ABN , Publish Date - Nov 24 , 2025 | 01:46 PM

డిప్యూటీ సీఎం పవన్ రాజమండ్రి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం నెలకొంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో పోలీసులతో రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు.

TDP Cadres Clash: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్
TDP Cadres Clash

రాజమండ్రి, నవంబర్ 24: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఎయిర్‌పోర్టులోకి రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణను అనుమతించకపోవడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌ను ఎలా అనుమతించారంటూ పోలీసులతో బొడ్డు వర్గం గొడవకు దిగింది. కాగా.. జిల్లా పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ ఈరోజు (సోమవారం) రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్. జగన్నాథపురం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు పవన్ రాజమండ్రికి చేరుకున్నారు.


విమానాశ్రయంలో పవన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా ఉన్న పెందుర్తి వెంకటేశ్ వర్టీయులు, రాజానగరం టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు వచ్చారు. అయితే పవన్‌ను కలిసేందుకు పెందుర్తి వర్గీయులను ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోకి పోలీసులు అనుమతించారు. కానీ బొడ్డు వెంకటరమణ వర్గీయులను మాత్రం లోనికి అనుమతించని పరిస్థితి. దీంతో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పెందుర్తి వర్గీయులను ఎయిర్‌పోర్టులోకి ఎలా అనుమతించారు?.. వాళ్లకు ప్రోటోకాల్ ఉందా? అని ప్రశ్నించారు.


తమను ఎందుకు అనుమతించడం లేదని బొడ్డు వర్గీయులు ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పెందుర్తి వర్గానికి చెందిన టీడీపీ నేతలు ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వచ్చారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం వాగ్విదానికి దిగాయి. బూతులు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకునే స్థాయికి రెండు వర్గాల నేతలు వెళ్లారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల నేతలను విడదీయడంతో పరిస్థితి సర్దుమణిగింది.


ఇవి కూడా చదవండి..

పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 01:51 PM