Nirmala Sitharaman: అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.. టచ్ చేసింది: నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:35 PM
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
అమరావతి, నవంబర్ 28: ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు మౌళిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు (CM Chandrababu) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... పండ్లు, కూరగాయల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఆహార అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు.

భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భూ త్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. బ్యాంకు రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయటం కాదని.. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఎన్నో సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా బ్యాంకర్లు కృషి చేయాలని వెల్లడించారు.

ఆస్ట్రోఫిజిక్స్ వంటి కోర్ స్కిన్స్ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తోందన్నారు. ఐఐఏతో చేసుకున్న ఒప్పందం ఈ ప్రాంత ప్రజల సైన్స్ పరిజ్ఞానానికి అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. కుటుంబంలో 3, 4 తరాలు ఒకప్పుడు బెనారస్ వెళ్లి సైన్స్ చదవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ప్యూర్ సైన్స్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో ఎంఓయూ కుదర్చుకోవడం.. తనను చాలా ఇంప్రెస్ చేసిందని.. టచ్ చేసిందన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఎంత వేగంగా సాయం చేయాలో చేయండని ప్రధాని చెప్పారని కేంద్రమంత్రి తెలిపారు. ఆచార్య నాగార్జునుడి రసాయన శాస్త్ర పరిజ్ఞానం గురించి డిబేట్లో మాట్లాడుతున్నారంటే ఈ ప్రాంత గొప్పతనం అర్థమవుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
ఒకరు ఎనిమిదో తరగతి.. మరొకరు తొమ్మిదో తరగతి.. విజయవాడ టు హైదరాబాద్..
నిర్మలా సీతారామన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News