Home » Jammu and Kashmir
కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆపరేషన్‌లో సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కశ్మీర్ చిన్నారులను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వారి చదువులకయ్యే ఖర్చును రాహుల్ గాంధీ భరిస్తానని అన్నారు. ఇందుకు సంబంధించి తొలి విడత నిధులు బుధవారం విడుదల అవుతాయని కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తాజాగా వెల్లడించారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.
పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి మందుపాతర పేలి ఆర్మీ జవాను శుక్రవారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
జమ్మూ కశ్మీర్‌లోని కత్రాలో ఉన్న పవిత్రమైన మాతా వైష్ణో దేవి యాత్ర మార్గం విషాదంగా మారింది. ఉదయం 8 గంటల సమయంలో బంగంగా ప్రాంతం వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన వల్ల యాత్రకు వచ్చిన పలువురు భక్తులు గాయపడ్డారు.
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్ ఎ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాక్ ఆక్రమిత కశ్మీర్.
Amarnath Yatra: యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతోంది.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని గత ఐదేళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇరువురు కోరారు. దీనితో పాటు లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1931 జూలై 13న జరిగిన ఘటనలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించే విషయంలో వివాదం రేగింది.