Share News

DGP Nalin Prabhat: ఫరీదాబాద్‌ భారీ పేలుడు ఘటనపై స్పందించి జమ్ము కాశ్మీర్ డీజీపీ

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:43 AM

జమ్ము కాశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు.

DGP Nalin Prabhat: ఫరీదాబాద్‌ భారీ పేలుడు ఘటనపై స్పందించి జమ్ము కాశ్మీర్ డీజీపీ

జమ్ము కాశ్మీర్ ఫరీదాబాద్‌(Jammu Kashmir explosion)లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది దుర్మరణం చెందగా.. 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. నౌగామ్ పోలీస్ స్టేషన్(Nowgam Police Station) సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్‌లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల శాంపిల్స్‌ను పరిశీలిస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు.


జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్(DGP Nalin Prabhat statement) మీడియాతో మాట్లాడుతూ... ' నౌగాం పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఇదొక దురదృష్ట ఘటన. దీనిపై ఎలాంటి ఊహగానాలు చేయవద్దు. నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాము. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాము. గత రెండు రోజుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాల ప్రొసీజర్ కొనసాగుతోంది. మా పోలీస్ సిబ్బంది శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు శుక్రవారం రాత్రి 11. 20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనపై ఎలాంటి ఊహగణాలు వద్దు. ఇది ఒక దురదృష్టకర సంఘటన మాత్రమే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా ఉన్నారు. 27 మంది పోలీసులు( JK police injured) గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాము. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము' అని డీజీపీ నలిన్ ప్రభాత్ వెల్లడించారు.



ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

I Bomma Website: ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 02:34 PM