Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదు.. బీసీఎఫ్ ఐజీ అశోక్ యాదవ్
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:33 PM
ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్పారు
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతోందని, పాకిస్థాన్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా తీవ్రస్థాయిలో సమాధానమిస్తామని సరిహద్దు భద్రతా దళం (BSF) ఇన్‌స్పెక్టర్ జనరల్ అశోక్ యాదవ్ తెలిపారు. శ్రీనగర్‌లో ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదులు ఇప్పటికీ అక్కడ ఉన్నట్టు చెప్పారు.
'ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆర్మీ, సరిహద్దు భద్రతా దళాలు పాకిస్థాన్‌లోని అనేక లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లపై విరుచుకుపడి ధ్వంసం చేశాయి. అయితే కొన్ని మాత్రం ఎల్ఓసీ వెంబడి అలాగే ఉన్నాయి. కొందరు ఉగ్రవాదులు అక్కడ సంచారం సాగిస్తున్నారు. అయితే ఉగ్రవాదులు ఎలాంటి చొరబాటు యత్నాలు చేసినా వాటిని తిప్పికొడతాం. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు, పాకిస్థాన్ ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా చాలా తీవ్రమైన స్పందన ఉంటుంది' అని అశోక్ యాదవ్ తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను పాక్ ముష్కరులు అత్యంత దారుణంగా చంపారు. ఇందుకు ప్రతిగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'తో విరుచుకుపడింది. ఎల్ఓసీ వెంబడి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసింది. పాక్ లోపలకు దూసుకువెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..
టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి