Watch Video: పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. సంచలన దృశ్యాలు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:31 PM
భారీ పేలుడుకు సంబంధించి షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ సీసీకెమెరాలో పేలుడు దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో..
జమ్మూ కశ్మీర్, నవంబర్ 15: జమ్మూకశ్మీర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల శరీర భాగాలు 300 మీటర్ల వరకు ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ భారీ పేలుడుకు సంబంధించి షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ సీసీకెమెరాలో పేలుడు దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు..
ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి 11:22 గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు సంభవించిన సమయంలో భారీ శబ్ధంతో పాటు.. చాలా ఎత్తు వరకు మంటలు ఎగసిపడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఇకపోతే.. పేలుడు శబ్ధం 15 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.
అసలేం జరిగింది..
ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఎక్కువ మొత్తంలో ఈ స్టేషన్‌లోనే భద్రపరిచారు. పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఈ కెమెకిల్స్ నుంచి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించగా.. పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది అధికారులు ప్రాణాలు కోల్పోగా.. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు.
Also Read:
క్రికెట్‌లోకి సచిన్ అరంగేట్రం ఈరోజే!
దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..