Share News

Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 23 , 2025 | 08:54 PM

Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్‌తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని నిలదీశారు.

 Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అయిందని.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నారని అన్నారు. అధికార కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కరువైన దుస్థితి ఉందన్నారు. అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది, కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసే నాథులు లేరు, ఆ పార్టీ ఉన్నా లేనట్టే అని విమర్శలు చేశారు. ఇవాళ(ఆదివారం) మంచిర్యాలలో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.


‘‘సీఎంగారు... మీలో పౌరుషం చచ్చిపోయిందా’’. అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్‌తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా’’ బండి అని సంజయ్ కుమార్ నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే అని స్పష్టం చేశారు. టీచర్లు, నిరుద్యోగులు, రైతుల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర బీజేపీదే అని గుర్తుచేశారు. ఆనాడు నల్లగొండ జిల్లాలో రైతుల వద్దకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు మమ్ముల్ని చంపాలని చూశారని ఆరోపించారు. భయపడకుండా తెగించి కొట్లాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదేనని చెప్పారు. రేవంత్ రెడ్డితో సహా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ప్రజా సమస్యపై జైలుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. 14 నెలల కాంగ్రెస్ మోసాలకు బుద్ది చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాలకు బలమివ్వాలని అన్నారు. బీజేపీలో ఒకే గ్రూప్ ఉంది.... తామంతా నరేంద్రమోదీ గ్రూప్ అని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.


దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ ఈటల రాజేందర్

eetala.jpg

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి బీసీ వ్యక్తి సీఎం కాలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ వ్యక్తి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీసీ వర్గాల్లో చైతన్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించి రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం చేసిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. ఓటమి భయంతో కొన్ని పార్టీలు బీజేపీ అభ్యర్థులపై.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ కిరణ్ ఖరే

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 23 , 2025 | 08:59 PM