Home » Congress
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.
నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు.
పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన ఏవీ సుబ్రమణియన్ పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన వెర్షన్ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు.