Home » MLC Elections
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. కౌంటింగ్ పూర్తి అయింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.
హైదరాబాద్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78% పోలింగ్ నమోదైంది. 112 ఓటర్లలో 88 మంది పోలింగ్‌లో పాల్గొనగా, బీఆర్‌ఎస్ పార్టీ ఎవరూ ఓటు వేయలేదు. ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.
Local Body MLC Election: 22 ఏళ్ల తరువాత తొలిసారి జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అనూహ్య స్పందన వచ్చింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు 8 గంటలకు ఎన్నికల ప్రారంభమైంది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.
Local Body MLC Election: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక జరుగనుంది.
రేపు జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలుస్తో్ది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీలో లేవు. దీంతో పోటీ బీజేపీ, మజ్లిస్ మధ్యే పోటీ ఉంది. అయితే సంఖ్యా బలంగా మజ్లిస్‌కే అవకాశాలున్నా.. బీజేపీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.