Share News

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుంది.. బీఆర్‌ఎస్‌ మద్దతుకు బీజేపీ యత్నం

ABN , Publish Date - Apr 17 , 2025 | 08:11 AM

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుంది.. బీఆర్‌ఎస్‌ మద్దతుకు బీజేపీ యత్నం

- పోటీకి దూరంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

- ఆ పార్టీల మద్దతు ఎవరికి... మరో ఆరు రోజుల్లో పోలింగ్‌

- కార్పొరేటర్లతో సమావేశం కాని బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు

- గులాబీ కార్పొరేటర్లను కలుస్తున్న బీజేపీ నాయకులు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC elections) రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలం లేకున్నా బరిలో దిగిన బీజేపీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని పిలుపునిస్తోంది. అత్యధిక ఓటర్లున్న ఎంఐఎం గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. బీజేపీ అభ్యర్థి ఎన్‌. గౌతమ్‌రావు కొందరు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్లను కలిసి తనకు ఓటేయాలని కోరుతున్నట్టు తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య


బీఆర్‌ఎస్‌ మద్దతుకు బీజేపీ యత్నం

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంబర్‌పేట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల పరిధిలోని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో టచ్‌లో ఉన్న బీజేపీ నేతలు, వారితో రహస్యంగా సమావేశమై సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు కాంగ్రెస్‌ కార్పొరేటర్లనూ కలుస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలపై అగ్రనేతల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు చెబుతున్నారు.


ఓటింగ్‌పై సంశయం

ఓటింగ్‌లో పాల్గొనడంపై కొందరు సంశయంలో ఉండగా, ఇంకొందరు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘ఇప్పుడు పోలింగ్‌ను బహిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళితే ఓటింగ్‌లో పాల్గొనని మీకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించే అవకాశం ఉంది’ అని ఓ కార్పొరేటర్‌ పేర్కొన్నారు. ఆత్మప్రభోదానుసారం ఓటు వేసే స్వేచ్ఛను పార్టీ ఇస్తుందని మరో కార్పొరేటర్‌ అభిప్రాయపడ్డారు. అధికారికంగా ఏ పార్టీకి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వకపోవచ్చని సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్పొరేటర్లతో సమావేశం కాలేదు. ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతునిచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేయలేదు. 112 మందికిగాను ఎంఐఎం 50 మంది, బీజేపీలో 24 మంది, బీఆర్‌ఎస్‏లో 24, కాంగ్రెస్‏లో 14 మంది ఓటర్లున్నారు. 23వ తేదీన పోలింగ్‌, 15న ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2025 | 08:14 AM