Home » BJP
గత (2024) లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. కనీసం 70 నుంచి వంద స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేశారో చెప్పడానికి మా వద్ద నూటికి నూరు శాతం ఆధారాలున్నాయి.
బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు.
బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉం డవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
లీగల్ కాంక్లేవ్ 2025లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్టు రాహుల్ తెలిపారు. ఆయన వాఖ్యలను రోహన్ జైట్లీ వెంటనే ఖండించారు.
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక (ఆగస్టు 20 తర్వాత).. ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఓ పత్రిక వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఖండించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారం, పది రోజుల్లో ఖరారవుతుందని తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటు కోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకున్నదని సమాచారం.