Share News

BJP In Harish Rao Hands: హరీష్ రావు చేతిలోకి బీజేపీ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Dec 02 , 2025 | 03:25 PM

హరీష్ రావు చేతిలోకి బీజేపీ వెళ్లిందని సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హరీష్, ఈటల రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని అన్నారు.

BJP In Harish Rao Hands: హరీష్ రావు చేతిలోకి బీజేపీ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్, 2 డిసెంబర్: తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మారిపోయారని అన్నారు.

ఇక నుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోందని చెందారు. తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు.. హరీష్ రావు, ఈటల రాజేందర్ వ్యూహంలో ఇప్పుడు బీజేపీ చిక్కిందని అన్నారు. ప్రస్తుతం సామ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. మరోసారి హరీష్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలకు ఆద్యం పోసినట్టయింది.


గులాబీ గూటి నుంచి..

హరీష్ రావు బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలు కొత్తేమి కాదు. గతంలో కూడా హరీష్ గులాబీ గూటి నుంచి ఎగిరిపోయి కాషాయ జెండా కప్పుకుంటున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హరీష్ రావు పలుమార్లు స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ లకు కవిత సూచనలు చేశారు. కాగా కవిత కూడా హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని పరోక్షంగా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాణాలు జరుగుతాయని సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ నిజమవుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.


ఇవీ చదవండి:

71ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

సబ్‌వేలో సడెన్‌గా ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. ట్రాక్స్‌ వెంబడి ప్రయాణికుల నడక

Updated Date - Dec 02 , 2025 | 03:57 PM