Home » Harish Rao
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్నలతో గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే..
గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై కేటీఆర్, హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.