సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్
ABN, Publish Date - Nov 26 , 2025 | 05:01 PM
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్కాంలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు హరీష్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ డైరెక్షన్‌లో రేవంత్ ప్రభుత్వం యాక్షన్ చేస్తోందని ఆరోపించారు. ఉన్న డిస్కంలను ప్రైవేట్‌పరం చేసేందుకు.. కొత్త డిస్కంలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కొత్త డిస్కంలతో నాణ్యమైన విద్యుత్ రాదన్నారు. థర్మల్ పవర్ కాదని... గ్రీన్ ఎనర్జీ తమ విధానమని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ చేసిన స్కాంకు సమాధానం చెప్పమంటే.. తమపై విచారణ చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో హైడ్రా పేరుతో జరుగుతోన్న స్కాంను బయటపెడతానని స్పష్టం చేశారు. మళ్ళీ వస్తామో రామోనన్న భయంతో.. కాంగ్రెస్ నేతలు బరితెగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ స్కాంలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని హరీష్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
గోపీనాథ్ చనిపోకపోయినా బైపోల్ వచ్చేది: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 26 , 2025 | 05:06 PM