Home » Revanth Reddy
Land Sale: హైదరాబాద్ శివారులోని భూములను అమ్మేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో ఎకరం భూమి ధర 104.74 కోట్లుగా TGIIC నిర్ధారించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మన ఖర్మ కాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు. అటు ఇటు కానోడు పరిపాలిస్తే.. ఇలాగే ఉంటుందని చెప్పారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను అడ్డగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కేసీఆర్ గత ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి, రాష్ట్రంలో మైక్రో ఎల్ఈడి, ASIP వంటి అధునాతన టెక్నాలజీ ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), పంచాయతీ స్థానాల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ..
మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ చురకలంటించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.