Share News

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:18 AM

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

- భారీ భద్రత.. డ్రోన్లతో పహారా

- 450 సీసీ కెమెరాలు.. మినీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

- పాస్‌లు లేనివారు స్టేడియం వద్దకు రావద్దు: సీపీ

హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌(Messi football match)పై ప్రపంచం దృష్టి ఉందని, స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రేక్షకులు నిబంధనలు పాటించి సహకరించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) తెలిపారు. ఉప్పల్‌ స్టేడియం వద్ద బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప్పల్‌ స్టేడియం వద్ద 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.


మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. టికెట్‌లు లేనివారు స్టేడియం వైపునకు రావద్దని సూచించారు. ఈ మ్యాచ్‌ ద్వారా హైదరాబాద్‌ కల్చర్‌..హెరిటేజ్‌ గురించి ప్రపంచానికి తెలుస్తోందని అందుకు ప్రేక్షకులు సహకరించాలన్నారు. నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకురావద్దని సూచించారు. వీఐపీలు వచ్చే సమయంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు. స్టేడియంలో ప్రతీ ఎంట్రీ గేటు వద్ద మెటల్‌ డిటెక్టర్‌ల ఏర్పాటుతో పాటు స్టేడియంతోపాటు పార్కింగ్‌ ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టామని తెలిపారు.


city2.2.jpg

బందోబస్తు విధుల్లో సెక్యూరిటీ వింగ్‌, షీటీమ్స్‌, ఏటీహెచ్‌యూ, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, 18 ప్లాటూన్‌ల ఏఆర్‌ ఫోర్స్‌, 2 ఆక్టోపస్‌ టీమ్‌లు, ఎస్‌బీ, సీసీఎస్‌, ఎస్‌ఓటీ, ఫైర్‌ విభాగాల సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. వీరికి తోడు 10 పోలీస్‌ మౌంటెడ్‌ వెహికల్స్‌, 2 వజ్ర వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్టేడియంతో పాటు పరిసరాలు పార్కింగ్‌ ప్రాంతాలతో పాటు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని నిరంతరం పరిశీలించేందుకు ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో మినీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం, పరిసరాల్లో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.


స్టేడియంలోకి అనుమతించనివి

ల్యాప్‌టా్‌పలు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్‌లు, గొడుగులు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు, అగ్గిపెట్టె, లైటర్‌, పదునుగా ఉండే ప్లాస్టిక్‌, లోహ వస్తువులు, బైనాక్యులర్స్‌, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, బ్యాగులు, క్రాకర్స్‌, పవర్‌ బ్యాంక్‌, పెట్స్‌, సెల్ఫీస్టిక్‌, బయట నుంచి ఆహార పదార్థాలను స్టేడియంలోకి అనుమతించరు.


ఈ వార్తలు కూడా చదవండి..

చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్‌ టీచర్‌

మా ఊరికి రోడ్డు వేయరూ..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2025 | 07:18 AM