Share News

MLA: సీఎంపై ఎమ్మెల్యే ఫైర్.. నాటుకోడి, చికెన్‌ సూప్‌కే ప్రాధాన్యం

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:21 PM

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎమ్మెల్యే కృష్ణ నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేవలం.. నాటుకోడి, చికెన్‌ సూప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర సంచలనానికి దారితీశాయి. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడున్నాయి.

MLA: సీఎంపై ఎమ్మెల్యే ఫైర్.. నాటుకోడి, చికెన్‌ సూప్‌కే ప్రాధాన్యం

- సీఎంపై హడగలి ఎమ్మెల్యే కృష్ణ నాయక్‌ ఆగ్రహం

- రైతుల కష్టాలు మరిచిపోయారంటూ ధ్వజం

బెంగళూరు: రాష్ట్రంలో రైతులు తీవ్రఇబ్బందుల్లో ఉంటే సీఎం, డీసీఎం మాత్రం ఒకరి ఇంట్లో మరొకరు నాటు కోడి, చికెన్‌సూ్‌పలు తింటూ కాలం గడుపుతున్నారని హడగలి ఎమ్మెల్యే కృష్ణ నాయక్‌(Hadagali MLA krishna Naik) మండిపడ్దారు. మంగళవారం రైతు సమస్యలపై నగరంలోని పడగట్టి ఆంజనేయగుడి నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తుంగభద్ర డ్యాం నుంచి రెండో పంటకు నీటి విడుదల, మొక్కజొన్న, కొనుగోలు ప్రారంభం, చక్కెర కర్మాగారం, ఏర్పాటు వంటి కీలక డిమాండ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


zzz.jpg

ఉదయం అల్పాహారంలో నాస్ట్‌ చికెన్‌ సూప్‌, రాత్రి ముద్ద, చికెన్‌ సూప్‌ తినడంపై ప్రచారం చేసుకుంటున్నారు కానీ రాష్ట్ర పరిపాలన వారికి పట్టడం లేదన్నారు. రైతుల కడుపు మంట, గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న కష్టాలు వారికి కనబడవు అన్నారు. రెతులను అదుకోవాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేణుకాచార్య, నగర మండలి అధక్ష్యడు రూపే్‌షకుమార్‌, ఉపాఽధ్యక్షుడు జీవరత్న, అయ్యల్లి తిమ్మప్ప, సాలి సిద్ధయ్య, తదితరులు పాల్గొన్నారు.


pandu1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 01:21 PM