Home » Bengaluru News
పెళ్లయినా వేధింపులకు గురి చేశాడా ఆ వ్యక్తి. అంతేకాక తన మాట వినకపోతే తనతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం
హిందువుగా దళిత సమాజంలో మూడగెరెలో జన్మించానని, భవిష్యత్తులో బీజేపీకి వెళ్తానో కాంగ్రెస్‌లో ఉంటానో, బీఎస్పీ లేదా ఎస్‌డీపీఐలో చేరుతానో అనేది వేచిచూద్దామని మూడిగెరె కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన మోటమ్మ అన్నారు. బుధవారం మూడిగెరెలో హిందూమహాసభ ఆధ్వర్యంలో గణపతి సమితి సమావేశంలో లోగో విడుదల చేశారు.
ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.
తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం కేశ్వన్ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రం అయ్యింది.. అందరికీ అన్నం పెట్టే రైతు కొప్పళ జిల్లాలో మట్టితిన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలంలో 980 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ మంత్రి శ్రీరాములు ప్రభుత్వంపై మండిపడ్డారు.
భద్ర నదిలో జీపు బోల్తాపడి గణపతికట్టి శమంత్ 22 అనే యువకుడు గల్లంతయ్యాడు..
కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.