Share News

DK Shivakumar: మాలో ఎటువంటి గ్రూపు తగాదాలు లేవు..

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:06 PM

మాలో ఎటువంటి గ్రూపులు లేవు... 2028లో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవన్నారు.

DK Shivakumar: మాలో ఎటువంటి గ్రూపు తగాదాలు లేవు..

- 2028లో అధికారమే లక్ష్యం

- సమష్టి నాయకత్వం

- డీసీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు: 2028లో మళ్లీ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు సతీశ్‌జార్కిహొళితో కలసి చర్చలు జరిపినట్టు డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakuma) తెలిపారు. సీఎం స్థానం కంటే పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే ప్రధానమన్నారు. కేపీసీసీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ అధ్యక్షుడినని, సతీశ్‌ జార్కిహొళి పార్టీ కార్యాధ్యక్షుడని ఇద్దరి మధ్యా ఆత్మీయ స్నేహం ఉందన్నారు.


pandu2.3.jpg

తామిద్దరం ఒకే క్యాబినెట్‌లో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. సతీశ్‌జార్కిహొళి పార్టీకి పెద్ద ఆస్తి లాంటివారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయ్యిందని, ఇక మిగిలిన సమయంలో ఏమేం పనులు చేపట్టాలని చర్చలు జరిగాయన్నారు. ఇంతకుమించి వేరే చర్చలు సాగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అంతా కాంగ్రెస్‌ గ్రూప్‌ అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


pandu2.2.jpg

తమది సమష్టి నాయకత్వమని, పార్టీ బలోపేతానికి తాను ఒక్కడినే కష్టపడలేదన్నారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో సిద్దరామయ్య, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. కాగా ముఖ్యమంత్రి పదవిపై ఉన్న గందరగోళానికి పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 01:06 PM