Home » CM Siddaramaiah
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సదాశివనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించారట. ఓ సంతాప సందేశాన్ని తప్పుగా అనువదించడం ద్వారా..
నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టింది మొదలు..
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్‌చల్ చేస్తోంది.
కాంగ్రెస్‌లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.
ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్(Ashok) ఎద్దేవా చేశారు.