Ashok: ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ..
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:21 PM
రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్ వ్యాఖ్యానించారు.
- అక్కడ కప్పం కడితేనే సీఎం పదవి
- టెంపుల్ రన్‌తో సమయం వృథా
- డీకేశీ ఆలయాల దర్శనంపై ప్రతిపక్ష నేత అశోక్
బెంగళూరు: రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్(Ashok) వ్యాఖ్యానించారు. దావణగెరెలో ఆయన గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ దారితప్పిన బిడ్డలా ప్రవర్తిస్తున్నారని బెంగళూరు రోడ్లలో గుంతలు పూడ్చడం మాని టెంపుల్‌రన్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పెద్ద దేవాలయానికి వెళ్ళకుండా సీఎం కాలేరన్నారు.

నవంబర్ క్రాంతి గురించి తన వాఖ్యలతో కాంగ్రెస్‌లో అల్లకల్లోలం అయ్యిందంటూనే సిద్దరామయ్య(Siddaramaiah) సంధ్యా కాలం గురించి కుమారుడు యతీంద్రనే బహిరంగం చేశారన్నారు. బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన టార్గెట్‌ను తెలిపేందుకే మంత్రులకు సీఎం విందు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందన్నారు. కాగా యతీంద్ర సిద్దరామయ్య వ్యాఖ్యలపై రామనగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ మాట్లాడుతూ యతీంద్రకు ఇంకా మాట్లాడటం రాదని ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News