Home » Sonia Gandhi
నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.
కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జిషీట్‌లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్ భవన్‌ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు.
Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.