CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:06 PM
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.
సిద్దిపేట, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తుచేశారు. 2004లో కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ ఇస్తానని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని వ్యాఖ్యానించారు.
50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో నిధులు ఎక్కువగా ఇచ్చారని.. మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. హుస్నాబాద్‌కు పదేళ్లు నిధులెందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులైనా ఇచ్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో లాగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయబోనని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఎవ్వరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా అలస్వతం ప్రదర్శించారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
For More TG News And Telugu News