Home » Telangana News
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. తాజాగా మరో రూ. 1189.43 కోట్లను విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్..
Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిని ఒకే వారంలో రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Timmapur Railway Station: ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.
Sarees For RS 9 In Vikarabad: మహిళలు ఇచ్చిన షాక్‌కు ఆ బట్టల షాపు యజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. 9 రూపాయలకే చీర అని తెలియగానే వందల మంది ఆడవాళ్లు షాపు ముందు బారులు తీరారు. చీరల కోసం గొడవ పెట్టుకున్నారు. వాళ్లకు చీరలు అందించలేక.. షాపు వాళ్లు చేతులు ఎత్తేశారు.
కొలిపాక శ్రీకృష్ణ సాయి, సివిల్స్ కోసం చేసిన 4 ప్రయత్నాల తర్వాత గ్రూప్-1లో 519 మార్కులతో 10వ ర్యాంకు సాధించారు. సామాజిక శాస్త్రాలపై ఆసక్తి పెరిగిన శ్రీకృష్ణ, 10 గంటలు ప్రతిరోజూ చదువుతూ ఈ విజయాన్ని సాధించారు
పీఆర్‌పీ చికిత్స ఓ స్కామ్ అని తెలంగాణకు చెందిన పలువురు ఆర్థొపెడిక్ సర్జన్లు స్పష్టం చేశారు. వైద్య ప్రయోజనాలు లేని పీఆర్‌పీని చికిత్సగా ప్రచారం చేయడం అనైతికమంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్‌పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది