-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 20th nov vreddy
-
BREAKING: దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ABN , First Publish Date - Nov 20 , 2025 | 06:38 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 20, 2025 19:20 IST
హైదరాబాద్: కేటీఆర్ కు హైకోర్టులో ఊరట
సైఫాబాద్ పీఎస్ లో ఆయనపై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు
కేటీఆర్, గోరెటి వెంకన్నపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదు
2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు
సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ఇంటర్వ్యూలు చేశారన్న పోలీసులు
అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేసులో పేర్కొన్న పోలీసులు
ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారన్న పోలీసులు
బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందన్న పోలీసులు
రాజకీయ లబ్ధి కోసమే కేసు నమోదు చేశారన్న కేటీఆర్ తరఫు న్యాయవాది
ఇరువైపులా వాదనలు విని కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసిన హైకోర్టు
-
Nov 20, 2025 19:03 IST
ముగిసిన సిట్ విచారణ
హైదరాబాద్: వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ముగిసిన సిట్ విచారణ
కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిని 7 గంటలు ప్రశ్నించిన సిట్ అధికారులు
విచారణ తర్వాత స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు
అవసరమైతే మరోసారి విచారిస్తామన్న ఏపీ సిట్ అధికారులు
వైవీ పీఏ చిన్న అప్పన్న, TTD అధికారుల స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ
-
Nov 20, 2025 16:58 IST
ప్రైవేట్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీ: చాణక్యపురిలోని ప్రైవేట్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
స్కూల్‌లో బాంబు పెట్టినట్టు మెయిల్ చేసిన దుండగుడు
స్కూల్‌లో తనిఖీలు చేపట్టిన బాంబ్‌స్క్వాడ్, ఫేక్ మెయిల్‌గా గుర్తింపు
-
Nov 20, 2025 16:58 IST
తెలంగాణలో రేవంత్, కేసీఆర్ పాలన నడుస్తోంది: బండి సంజయ్
కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామన్నారు: బండి సంజయ్
ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారు: బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది: బండి సంజయ్
-
Nov 20, 2025 16:57 IST
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దు: రాజాసింగ్
మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడిపై వ్యాఖ్యలు చేస్తారా?
నమ్మకం లేదంటూనే దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు
రాజమౌళి నిజంగా నాస్తికుడైతే.. అదే మాట చెప్పాలి: రాజాసింగ్
గతంలో కూడా హిందూ దేవుళ్లపై ఇలాగే మాట్లాడారు: రాజాసింగ్
ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తాం
నాస్తిక డైరెక్టర్ల సినిమాలు జనం చూడొద్దు: రాజాసింగ్
-
Nov 20, 2025 16:57 IST
సీఎం రేవంత్‌ను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో అలెక్స్ కిప్‌మాన్
హైదరాబాద్‌లో ట్రాఫిక్, వరదల నియంత్రణకు టెక్నాలజీ సహకారం కోరిన సీఎం
ప్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ ప్రాజెక్టుల గురించి వివరించిన సీఎం రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌ను హాజరుకావాలని అలెక్స్‌ను ఆహ్వానించిన రేవంత్
-
Nov 20, 2025 15:52 IST
మరో నలుగురు అరెస్ట్
ఢిల్లీ: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో మరో నలుగురు అరెస్ట్
ఎర్రకోట పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్
-
Nov 20, 2025 15:01 IST
హైదరాబాద్: మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆత్మహత్యాయత్నం
సఫిల్‌గూడ చెరువులో దూకి కార్పొరేటర్ శ్రవణ్ ఆత్మహత్యాయత్నం
తన డివిజన్‌లో కార్యక్రమాలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మనస్తాపం
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను బెదిరించి...
తన ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేస్తున్నారని ఆరోపణ
-
Nov 20, 2025 15:00 IST
విశాఖ: ప్రధాని ఆవాస్ యోజన అర్బన్ 2.0...
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత
అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణమండపంలో మంజూరు
పత్రాలు అందజేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు
-
Nov 20, 2025 13:51 IST
హైదరాబాద్: వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు
TTD కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముమ్మరం
ఇప్పటికే సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సహా..
TTD మాజీ ఈఓ, అధికారులను ప్రశ్నించిన సిట్
-
Nov 20, 2025 13:51 IST
మావోయిస్టు అగ్రనేతలపై హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
మావోయిస్టులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌ను కోర్టులో హాజరుపర్చేలా..
పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్
దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తమ దగ్గర లేరని హైకోర్టుకు నివేదించిన పోలీసులు
అరెస్ట్ చేసిన మావోయిస్టులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చామని వివరణ
వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారనే ఆధారాలను కోర్టు ఎదుట ఉంచాలని హైకోర్టు ఆదేశం
మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని..
పోలీసులు మీడియాకు చెప్పారని పిటిషనర్ వాదన
హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
-
Nov 20, 2025 12:59 IST
తెలంగాణలో RK పాలన నడుస్తోంది: బండి సంజయ్
ఆర్కే అంటే రేవంత్, కేటీఆర్: బండి సంజయ్
ఇంతకాలం గవర్నర్ అనుమతి ఇవ్వలేదని కేంద్రాన్ని టార్గెట్ చేశారు
ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తారో సమాధానం చెప్పాలి: బండి సంజయ్
ఇద్దరు దోస్తానా ఇప్పుడు బయటపడుతుంది
-
Nov 20, 2025 12:59 IST
హైదరాబాద్: దానం, కడియం శ్రీహరికి మరోసారి స్పీకర్ నోటీసులు
అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసిన స్పీకర్
-
Nov 20, 2025 12:58 IST
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రధాని మోదీ అభినందనలు
-
Nov 20, 2025 12:55 IST
10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నితీష్ కుమార్ విజువల్స్
-
Nov 20, 2025 12:51 IST
హైదరాబాద్: చంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
ఐ బొమ్మ కేసులో రవికి 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి
సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఐ బొమ్మ రవిని తరలించిన పోలీసులు
ఐ బొమ్మ అంశంపై రవిని లోతుగా విచారించనున్న సైబర్‌క్రైమ్ పోలీసులు
-
Nov 20, 2025 12:32 IST
పట్నా: బిహార్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం
పదోసారి సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం
పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ ప్రమాణస్వీకారం
నితీష్‌తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణస్వీకారం
డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్‌సిన్హా
ప్రధాని మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు

-
Nov 20, 2025 12:31 IST
కామారెడ్డి: డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పిస్తామన్న మంత్రి సీతక్క
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
-
Nov 20, 2025 12:30 IST
కామారెడ్డి: కూతురు పెళ్లి చేసే స్థోమత లేక తండ్రి ఆత్మహత్య
ఐదేళ్లుగా కూతురి పెళ్లికోసం అవస్థలు పడుతున్న చిట్టె వీరయ్య(70)
బాన్సువాడ మం. నెమ్లికి చెందిన వీరయ్య...
నెమ్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని చిట్టె వీరయ్య ఆత్మహత్య
తన ఆత్మహత్యకు కారణాలు వెల్లడిస్తూ లేఖ
-
Nov 20, 2025 12:25 IST
నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ
లోటస్ పాండ్‌కు బయల్దేరిన జగన్
-
Nov 20, 2025 11:28 IST
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా: రేవంత్‌రెడ్డి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషీకి వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే..
సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందన్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలాగే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా..
సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
అవసరమైతే అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని కోరిన సీఎం
పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా..
సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
Nov 20, 2025 11:28 IST
విశాఖలో ఘోరం
ఓ చోట కల్వర్టులో కనిపించిన చిన్నారి కాళ్లు, చేతులు
చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లు గుర్తించిన పోలీసులు
ఘటనా స్థలికి కంచరపాలెం పోలీసులు
-
Nov 20, 2025 11:26 IST
గవర్నర్-రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
గవర్నర్‌కు బిల్లులను నిరోధించే అవకాశం లేదు: సుప్రీంకోర్టు
రాష్ట్ర పాలనలో తుది అధికారం మంత్రివర్గానిదే: సుప్రీంకోర్టు
ఒక రాష్ట్రంలో రెండు పరిపాలనా కేంద్రాలు ఉండవు: సుప్రీంకోర్టు
ప్రభుత్వం ఒక్కటే ప్రధాన నిర్ణయాధికారి: సుప్రీంకోర్టు
-
Nov 20, 2025 11:23 IST
హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్టుకు వైఎస్ జగన్
నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ పయనం
నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర పోలీసుల భారీ బందోబస్తు
పోలీసుల ఆధీనంలో కోర్టుకు వచ్చే రెండు మార్గాలు
సీబీఐ కోర్టు గేటు మూసివేసిన పోలీసులు
న్యాయవాదులకు మాత్రమే కోర్టులోకి అనుమతి
కోర్టుకు భారీగా చేరుకున్న జగన్ అభిమానులు
-
Nov 20, 2025 11:02 IST
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి
జగన్ కు స్వాగతం పలికిన వైసిపి నేతలు
మరికొద్ది సేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్న జగన్
-
Nov 20, 2025 10:33 IST
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ దగ్గర వైసీపీ శ్రేణులు హంగామా
-
Nov 20, 2025 10:32 IST
బిహార్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం
పట్నా గాంధీ మైదానంలో నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం
రికార్టు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్‌కుమార్
నితీష్‌కుమార్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
-
Nov 20, 2025 10:27 IST
హైదరాబాద్: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి
కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు...
గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ
నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనున్న ఏసీబీ
విచారణ తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం
-
Nov 20, 2025 10:12 IST
హైదరాబాద్: నాంపల్లి కోర్టు దగ్గర పోలీసుల బందోబస్తు
జగన్ హాజరవుతుండటంతో కోర్టు వద్దకు తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు
కోర్టు ప్రాంగణ పరిసరాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరిమిన పోలీసులు
హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న వైసీపీ అభిమానులు
ఫ్లకార్డులతో వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు
-
Nov 20, 2025 09:54 IST
వాషింగ్టన్: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం
డెమోక్రాట్లతో నిందితుడు జెఫ్రీకి ఉన్న సంబంధాలపై..
త్వరలో వాస్తవాలు బయటపడొచ్చు: ఎక్స్‌లో ట్రంప్
-
Nov 20, 2025 09:27 IST
ఐపీవోకు పీపుల్ ఇంటరాక్టివ్ ఇండియా
ప్రస్తుతం ఈ సంస్థ ఆధీనంలోనే షాదీ.కామ్
ఇప్పటికే ఇన్వెస్టర్లు, బ్యాంకర్లతో చర్చలు
-
Nov 20, 2025 09:27 IST
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
121 పాయింట్ల లాభంతో 85,307 దగ్గర సెన్సెక్స్ ట్రేడింగ్
35 పాయింట్ల లాభంతో 26,087 వద్ద కొనసాగుతోన్న నిఫ్టీ
-
Nov 20, 2025 09:01 IST
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు
బ్యాంక్ కాల్స్ 1600 సిరీస్ నెంబర్‌తోనే రావాలని ఆదేశం
2026 జనవరి 1 నుంచి అమలు చేయాలన్న ట్రాయ్
-
Nov 20, 2025 08:51 IST
కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న భువనేశ్వరి పర్యటన
డీకేపల్లి చెరువు దగ్గర జలహారతి ఇవ్వనున్న నారా భువనేశ్వరి
డీకేపల్లిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు భువనేశ్వరి శంకుస్థాపనలు
KGBV స్కూల్ నూతన క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించనున్న భువనేశ్వరి
డీకేపల్లి KGBV స్కూల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి
-
Nov 20, 2025 08:51 IST
ఐబొమ్మ లాగే మరో పైరసీ వెబ్‌సైట్
ఈసారి 'ఐబొమ్మ వన్' అంటూ కొత్త వెబ్‌సైట్
'ఐబొమ్మ వన్'లో కనిపిస్తున్న కొత్త తెలుగు సినిమాలు
క్లిక్ చేస్తే మూవీ రీల్స్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్న వెబ్‌సైట్
ఐబొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్‌సైట్లు
అందులో ఐబొమ్మ వన్‌ని తెచ్చారంటున్న పోలీసులు
-
Nov 20, 2025 08:50 IST
ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన అంశాలు
రవి సెల్‌ఫోన్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్..
నెంబర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నుంచి..
పైరసీ జరుగుతున్నట్లు పోలీసుల గుర్తింపు
గతంలో సర్వర్లు, డొమైన్ల నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు
-
Nov 20, 2025 08:25 IST
కేరళ: శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ
ఆలయం తెరిచిన 3 రోజుల్లో 3 లక్షల మందికి దర్శనం
కేరళ హైకోర్టు ఆదేశాలతో స్పాట్ బుకింగ్ టికెట్లును 5వేలకు తగ్గింపు.
ఆన్ లైన్ ద్వారా రోజుకు 70 వేల మందికి టికెట్ల జారీ.
నేటి నుంచి రోజుకు 75 వేల మందికి మాత్రమే దర్శనం.
సోమవారం వరకు స్పాట్ టికెట్లు జారీపై ఆంక్షలు.
పంబ నుంచి సన్నిధానం మార్గంలో తగ్గుముఖం పట్టిన రద్దీ.
స్పాట్ బుకింగ్ టికెట్ల కోటా తగ్గడంతో భక్తులు ఇబ్బందులు.
టిక్కెట్లు లేని వారిని నీలక్కల్ వద్దే ఆపివేస్తున్న భద్రతా సిబ్బంది.
స్పాట్ బుకింగ్ టికెట్లు కోసం వేచి ఉన్న వేలాది మంది భక్తులు.
టిక్కెట్లు దొరక్క ఆందోళనకు దిగుతున్న భక్తులు.
-
Nov 20, 2025 08:24 IST
ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈనెల 24న వాయుగుండంగాం బలపడే అవకాశం
ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరికి వర్షసూచన
-
Nov 20, 2025 08:24 IST
సాకర్ ప్రపంచకప్ బరిలోకి కరేబియన్ దీవి క్యురసావ్
వచ్చే ఏడాది ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన క్యురసావ్
ఈ మెగా టోర్నీలో ఆడబోతున్న అత్యంత చిన్న దేశం క్యురసావ్
-
Nov 20, 2025 08:24 IST
నేడు బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
నితీష్‌కుమార్‌తో పాటు 19 మంది మంత్రులు ప్రమాణం
పట్నా గాంధీ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం
హాజరుకానున్న ప్రధాని మోదీ, ఎన్‌డీఏ నేతలు
నేడు బిహార్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
నితీష్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న నేతలు
-
Nov 20, 2025 08:23 IST
ఏపీలో పర్మిట్‌రూమ్‌లకు ఆర్‌ఈటీ చెల్లింపు విధానంలో సవరణలు
ఒకేసారి చెల్లింపునకు బదులు 3 వాయిదాల్లో ఆర్‌ఈటీ వసూలు
ఏపీ ఎక్సైజ్ నియమాలు సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
నవంబర్ 20లోపు తొలి విడత రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లింపు
2020 మార్చి 20లోపు రెండో విడత ఆర్‌ఈటీ చెల్లించాలని ఆదేశాలు
2020 జులై 20లోపు మూడో విడత ఆర్‌ఈటీ చెల్లింపునకు ఆదేశాలు
-
Nov 20, 2025 08:23 IST
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు
వర్చువల్ బుకింగ్ ద్వారా రోజుకు 70 వేల మందికి మాత్రమే అనుమతి
స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమలకు రోజుకు 5 వేల మందికి అనుమతి
వర్చువల్ బుకింగ్ లేకుంటే నీలక్కల్ నుంచి శబరిమలకు అనుమతి నిరాకరణ
నీలక్కల్, వండిపెరియార్, ఎరుమెలి, చెంగన్నూర్‌లో స్పాట్ బుకింగ్‌కు అవకాశం
-
Nov 20, 2025 08:22 IST
నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లే దాకా బలప్రదర్శనకు ప్లాన్
దారి పొడవునా హడావుడి చేయాలని వైసీపీ ప్రణాళిక
న్యాయస్థానానికి సమయం ఇచ్చిన జగన్ అంటూ...
ఆయన విడుదల చేసిన షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు
-
Nov 20, 2025 06:38 IST
తెలంగాణలో జిల్లాల పర్యటనకు సీఎం నిర్ణయించినట్లు సమాచారం
వచ్చేనెల ఒకటి నుంచి 7 వరకు సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు అవకాశం
-
Nov 20, 2025 06:38 IST
నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లే దాకా బలప్రదర్శనకు ప్లాన్
దారి పొడవునా హడావుడి చేయాలని వైసీపీ ప్రణాళిక
న్యాయస్థానానికి సమయం ఇచ్చిన జగన్ అంటూ...
ఆయన విడుదల చేసిన షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు
-
Nov 20, 2025 06:38 IST
అమరావతి: ఆరేళ్ల తర్వాత నేడు కోర్టుకు వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో నేడు కోర్టుకు వైసీపీ అధ్యక్షుడు జగన్
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్
జగన్ విచారణ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
Nov 20, 2025 06:38 IST
స్థానిక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు
ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటన
నేటి నుంచి ఈ నెల 23 వరకు ఓటర్ల జాబితా సవరణ
ఈ నెల 23న తుది ఓటరు జాబితా విడుదల: ఈసీ
-
Nov 20, 2025 06:38 IST
పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులు
గాజా స్ట్రిప్ లక్ష్యంగా వైమానికి దళం దాడులు, 22 మంది మృతి
హమాస్ ఉగ్రదాడులకు యత్నించడం వల్లే స్ట్రైక్స్ అంటున్న ఇజ్రాయెల్