Share News

Software Engineer Sad incident: నిజామాబాద్‌లో ఘోరం.. ప్రేమించి మోసపోయానని యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:48 AM

ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

Software Engineer Sad incident: నిజామాబాద్‌లో ఘోరం..  ప్రేమించి మోసపోయానని యువకుడి ఆత్మహత్య
Software Engineer Sad incident

నిజామాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి మోసపోయానని గ్రహించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌రెడ్డి తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు లండన్ నుంచి నిజామాబాద్ వచ్చారు.


అయితే.. సదరు యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో పెళ్లి జరిపించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్‌రెడ్డి మృతిచెందారు.


ఈ ఘటనతో శ్రీకాంత్ కుటుంబం.. నిజామాబాద్ పట్టణంలో మృతదేహంతో ఆందోళనకు దిగింది. ఇంతలో పోలీసులు వీరి ఆందోళనను అడ్డుకున్నారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి మృతిపై నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 12:20 PM