-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 21st nov vreddy
-
BREAKING: దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
ABN , First Publish Date - Nov 21 , 2025 | 06:30 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 21, 2025 21:05 IST
దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
జొహానెస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం
జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ
ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా సమావేశంలో పాల్గొననున్న మోదీ
-
Nov 21, 2025 21:05 IST
సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ
లేఖలో పలు అంశాలు ప్రస్తావించిన జగన్
ట్రైబ్యునల్‌లో ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలన్న జగన్
-
Nov 21, 2025 21:05 IST
అమరావతి: మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నేతలు
ఇకపై టీచర్లకు బోధనేతర బాధ్యతలు ఉండవు: మంత్రి లోకేశ్
లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనే పూర్తిగా దృష్టిపెట్టండి: మంత్రి లోకేశ్
-
Nov 21, 2025 21:05 IST
సీఎస్ విజయానంద్ సర్వీసు పొడిగించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం
విజయానంద్ సర్వీసు మరో 3 నెలలు పొడిగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
2026 ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్న విజయానంద్
తర్వాత స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించనున్న సీఎం
2026 మే నెలతో ముగియనున్న సాయిప్రసాద్ పదవీకాలం
-
Nov 21, 2025 21:05 IST
బెంగళూరులో రూ.7.11 కోట్ల నగదు చోరీ కేసులో ఆధారాలు లభ్యం
బెంగళూరు నుంచి డబ్బుతో చిత్తూరుకు పారిపోయిన దుండగులు
చిత్తూరులోని గుడిపాల వద్ద చోరీకి వినియోగించిన వాహనం గుర్తింపు
గుడిపాల మం. చిత్తపార సమీపంలో బాక్సులు గుర్తింపు
డబ్బు తీసుకుని ఖాళీ బాక్సులను అడవిలో పడేసిన దుండగులు
గుడిపాలలో విచారణ జరుపుతున్న 13 మంది బెంగళూరు పోలీసులు
చిత్తపార గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Nov 21, 2025 18:00 IST
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు టెన్త్ ఎగ్జామ్స్
ఉ.9:30 నుంచి మ.12:45
-
Nov 21, 2025 17:34 IST
కార్మిక చట్టాలపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో 4 కార్మిక చట్టాలు అమల్లోకి తెచ్చిన కేంద్రం.
29 కార్మిక చట్టాల స్థానంలో 4 కార్మిక చట్టాలు అమలు.
వేతనాల చట్టం 2019, పారిశ్రామిక సంబంధాల చట్టం 2020.
సామాజిక భద్రత చట్టం, వృత్తిపరమైన భద్రత చట్టం 2020.
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత సమగ్రమైన కార్మిక సంస్కరణ.
కొత్త చట్టాలు కార్మికుల హక్కులను పరిరక్షిస్తాయి: మోదీ
-
Nov 21, 2025 17:32 IST
తెలంగాణలో వివిధ పథకాలకు రూ.480 కోట్లు విడుదల
సన్న ధాన్యం బోనస్, ఎల్బీజీ మహాలక్ష్మితో పాటు..
మైనార్టీశాఖలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.
సన్నధాన్యం బోనస్‌కు రూ.200 కోట్లు, ఎల్పీజీ పథకానికి రూ.60 కోట్లు విడుదల.
మైనార్టీశాఖకు రూ.220 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.
-
Nov 21, 2025 16:40 IST
ముగిసిన విచారణ.. శ్రీముఖి ఏం చెప్పిందంటే..
బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్రీముఖి సీఐడీ విచారణ ముగిసింది.
గంటన్నర పాటు విచారణ చేసిన సీఐడీ.
M88 అనే బెట్టింగ్ యాప్‌తో ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సీఐడీ సిట్.
తన ప్రమేయం లేకుండానే ఈ బెటింగ్ యాప్ ప్రమోషన్‌లో ఇరుక్కున్నానని శ్రీముఖి స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఓ కార్యక్రమం షూట్ సమయంలో ఓ అమ్మాయి కాల్ చేసి ప్రమోషన్ వీడియో చేయాలని చెప్పింది.
ఆ సమయంలో మొబైల్ నా దగ్గర లేదు. మా స్నేహితుడు లిఫ్ట్ చేశాడు.
ఆ కాల్ తరువాత ఒక స్క్రిప్ట్ పంపించారు, అదే స్క్రిప్ట్ నేను చదవివాను అని CID ముందు వాంగ్మూలం.
తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కుపోయానని వాంగ్మూలం ఇచ్చింది శ్రీముఖి.
-
Nov 21, 2025 16:38 IST
కేటీఆర్ ఆరోపణలు.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
కేబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం: మంత్రి శ్రీధర్‌బాబు
పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
కేటీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడట్లేదు.
ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు.
ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్‌కు తేడాలేకుండా కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ ప్రగతిలో భాగంగా పాలసీ తీసుకున్నాం.
పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి జరగకూడదనే కేటీఆర్ ఆలోచన.
ORR లోపల ఉన్న పరిశ్రమలు బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించాం.
నిబంధనల ప్రకారమే పరిశ్రల భూముల వినియోగం.
BRS ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది.
BRS హయాంలో ఎవరికీ సంబంధం లేకుండా జీవోలు ఇచ్చారు.
మేం అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదు.
2023లో BRS ప్రభుత్వం మూడు జీవోలు ఇచ్చింది.
జీవో ప్రకారం హైదరాబాద్‌లోని భూముల ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి ఇచ్చారు.
-
Nov 21, 2025 16:35 IST
తెలంగాణలో 32 మంది IPSల బదిలీలు
తెలంగాణ అడిషనల్ డీజీగా జయేంద్రసింగ్ చౌహాన్.
తెలంగాణ సీఐడీ డీజీగా పరిమళా నూతన్.
పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్.
సౌత్‌జోన్ డీసీపీగా కిరణ్ కారే.
నార్కోటిక్ ఎస్పీగా పద్మజ.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్‌గైక్వాడ్.
మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి.
నాగర్‌కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్.
మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్.
ఆసిఫాబాద్ ఎస్పీ నిఖితాపంత్.
వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా.
వనపర్తి ఎస్పీగా సునీత.
ములుగు ఎస్పీగా సుధీర్.
భూపాలపల్లి ఎస్పీగా సంకేత్.
సౌత్‌జోన్ డీసీపీగా కిరణ్ ఖారే.
మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్.
తెలంగాణ గవర్నర్ ADCగా సుభాష్.
పెద్దపల్లి డీసీపీగా బి.రామ్‌రెడ్డి.
భద్రాద్రి అడిషనల్ ఎస్పీగా అవినాష్.
ఆదిలాబాద్ ఎస్పీగా కాజల్.
భువనగిరి ఏఎస్పీగా రాహుల్‌రెడ్డి.
సిరిసిల్ల ఏఎస్పీగా శేషాద్రి.
ములుగు ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ.
ఆదిలాబాద్ ఏఎస్పీ(అడ్మిన్) మౌనిక.
ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్.
నిర్మల్ ఏఎస్పీగా సాయి కిరణ్.
వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి.
ఖమ్మం ఏసీపీగా వసుందర ఫౌరెబి.
-
Nov 21, 2025 16:24 IST
దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం.
కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం.
తేజస్ యుద్ధ విమానం కూలిన వెంటనే భారీగా మంటలు.
ఇంకా లభించని పైలట్ ఆచూకీ.
మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ విమానం.
బెంగళూరులోని HAL సంస్థలో తయారైన విమానం.
-
Nov 21, 2025 15:24 IST
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ
30 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
-
Nov 21, 2025 12:50 IST
గవర్నర్లకు గడువు విధించేవరకు వెనక్కి తగ్గబోం: సీఎం స్టాలిన్
గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణలు తెచ్చేవరకు..
తమ పోరాటం ఆగదని స్సష్టంచేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: స్టాలిన్
-
Nov 21, 2025 12:50 IST
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో కడియం శ్రీహరి భేటీ
ఈ నెల 23న కలవాలని కడియంకు స్పీకర్ నోటీసులు
గడువుకు ముందే స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి
వివరణ ఇవ్వటానికి సమయం కోరిన కడియం శ్రీహరి
ఈ నెల 23న స్పీకర్‌ను కలవాలని ఇది వరకే దానంకు నోటీసులు
దానం నాగేందర్ హాజరుపై ఉత్కంఠ
నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో దానం నాగేందర్ భేటీ
-
Nov 21, 2025 12:49 IST
ఎసిబి కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
నా కుటుంబం అంతా మద్యం వల్లే చిన్నాభిన్నం: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
వందల ఏళ్ల నాటి నా ఆస్తులను జప్తు చేశారు.. ఇది ధర్మం కాదు
నేను కష్టపడి సంపాదించిన దానిని లిక్కర్ ద్వారా సంపాదించానని చెబుతున్నారు
నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నేను నిజంగా తప్పు చేశాననే భావన ప్రజల్లోకి వెళ్తుంది
ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టినా నాకు భయం లేదు
-
Nov 21, 2025 12:42 IST
నవంబర్ 23న భారత్ బంద్‌కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు
హిడ్మా, రాజేతో పాటు కొంతమందిని క్రూరంగా హత్యచేసి ఎన్‌కౌంటర్
పోలీసుల క్రూర హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్
-
Nov 21, 2025 12:42 IST
ఫార్ములా-ఈ రేసు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది: కేటీఆర్
నేను తప్పు చేయలేదని గతంలో చాలాసార్లు చెప్పా: కేటీఆర్
లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పా: కేటీఆర్
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తోంది: కేటీఆర్
సివిల్ సప్లయ్ అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు
మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ ఉత్తుత్తి దాడులు చేసింది: కేటీఆర్
మళ్లీ అధికారంలోకి వస్తాం.. అన్ని లెక్కలు తేలుస్తాం: కేటీఆర్
-
Nov 21, 2025 11:38 IST
ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం
ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా..
స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని 2రోజుల క్రితం సుప్రీం ఆదేశం
వింటర్ సీజన్‌లో స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్న ఢిల్లీ స్కూల్స్
నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించే క్రీడలను ఆపేయాలని ప్రభుత్వం ఆదేశం
-
Nov 21, 2025 10:43 IST
నవంబర్ 30న అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చలు జరపనున్న కేంద్రం
-
Nov 21, 2025 10:02 IST
అల్లూరి: మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం
ఇంకా రంపచోడవరం ఏరియా ఆస్పత్రి మార్చరీలోనే 9 మృతదేహాలు
ఇప్పటివరకు హిడ్మా దంపతులు, టెక్ శంకర్, దేవే మృతదేహాలు మాత్రమే అప్పగింత
-
Nov 21, 2025 09:54 IST
నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల
ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల
గండికి కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
యుద్ధప్రాతిపదికన గండి పూడ్చుతున్న అధికారులు
-
Nov 21, 2025 09:50 IST
థాయ్‌లాండ్: మిస్ యూనివర్స్‌గా మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్
టాప్-12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ(భారత్)
-
Nov 21, 2025 09:44 IST
SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో ప్రత్యక్షమైన పైరసీ సినిమాలు
ఐబొమ్మ పేరును వాడుకుంటున్న పైరసీ వెబ్‌సైట్లు
ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్లకు ఐబొమ్మగా పేరుమార్చి..
వాటిపై క్లిక్ చేస్తే తమ పేజ్ ఓపేన్ అయ్యేలా మార్చిన కేటుగాళ్లు
తాజాగా ఐబొమ్మ ప్లస్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే మూవీరూల్జ్ రెడైరెక్ట్
-
Nov 21, 2025 09:43 IST
అమరావతి: వెంకటపాలెం, ఉద్దంటరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన
సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్ భవనాలు పరిశీలన
మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి: మంత్రి నారాయణ
రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం: మంత్రి నారాయణ
-
Nov 21, 2025 09:43 IST
చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న నారా భువనేశ్వరి
శాంతిపురం, రామకుప్పం మండలాల్లో హంద్రీనీవా జలహారతి కార్యక్రమం
నడింపల్లిలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
-
Nov 21, 2025 09:30 IST
హైదరాబాద్: ఐబొమ్మ రవిపై మరో మూడు సెక్షన్లు నమోదు
ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టిన పోలీసులు
ఐటీ యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్,..
విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు పెట్టిన పోలీసులు
తాజాగా ఫోర్జరీ సెక్షన్లు జోడించిన పోలీసులు
ప్రహ్లాద్ పేరుతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్న రవి
ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేసిన పోలీసులు
రెండోరోజు కస్టడీలో రవిని ప్రశ్నించనున్న పోలీసులు
-
Nov 21, 2025 09:13 IST
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC షాక్
ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న స్టూడియోలు
వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత
రూ.11.52లక్షలకు రూ.49వేలు చెల్లిస్తున్న అన్నపూర్ణ స్టూడియో
రూ.1.92లక్షలకు రూ.1,900 చెల్లిస్తున్న రామానాయుడు స్టూడియో
పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాని నోటీసులు జారీ
-
Nov 21, 2025 09:13 IST
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో కీలక అంశాలు
2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు టర్కీలో పర్యటించినట్టు గుర్తింపు
సిరియాకు చెందిన ఆపరేటీవ్‌తో భేటీ అయిన ఉగ్ర డాక్టర్లు
సమావేశాన్ని పాక్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసినట్టు గుర్తింపు
మరోవైపు అల్-ఫలాహ్ వర్సిటీపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
-
Nov 21, 2025 08:00 IST
పల్నాడు: నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండి
కారంపూడి ఎస్కేప్ ఛానల్ దగ్గర కట్టకు అర్ధరాత్రి గండి
నాగేలేటి వాగుకు పెరిగిన ప్రవాహం, ఆందోళనలో సమీప ప్రాంత ప్రజలు
గండి పూడ్చే పనిలో సాగర్ కెనాల్ అధికారులు
ఎవరో కావాలని గండి కొట్టినట్టు స్థానికులు అనుమానం
-
Nov 21, 2025 07:59 IST
ఏలూరు: మావోయిస్టుల అరెస్టులో కీలక అంశాలు
అక్టోబర్ 26న ఇల్లు అద్దెకు తీసుకున్న మావోయిస్టులు
కేబుల్ పని చేస్తున్నామని నెలకు రూ.10వేల చొప్పున ఇల్లు అద్దె
ఇద్దరు మాత్రమే బయట నుంచి ఆహారం తీసుకొచ్చేవారన్న స్థానికులు
ఇంటి యజమానిని ప్రశ్నిస్తోన్న పోలీసులు
ఇల్లు అద్దెకు మధ్యవర్తిత్వం ఎవరు వహించారని ఆరా
-
Nov 21, 2025 07:59 IST
ఢిల్లీ: నేడు SIRపై సుప్రీంకోర్టులో విచారణ
కేరళ ప్రభుత్వం పిటిషన్‌పై విచారించనున్న సుప్రీంకోర్టు
-
Nov 21, 2025 07:59 IST
నేడు సౌతాఫ్రికాకు ప్రధాని నరేంద్ర మోదీ
3 రోజుల పాటు సౌతాఫ్రికాలో పర్యటించనున్న మోదీ
20వ జీ20 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ
శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న 40 దేశాలు
-
Nov 21, 2025 07:58 IST
నేడు రెండోరోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ
టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపనున్న పోలీసులు
నిన్న 6గంటల పాటు రవిని ప్రశ్నించిన పోలీసులు
-
Nov 21, 2025 06:30 IST
తెలంగాణ వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉత్తర తెలంగాణ జిల్లాలను వణికిస్తోన్న చలిగాలులు
10 జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
పటాన్‌చెరు 9, మెదక్‌లో 9.2డిగ్రీల ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ 10.4, హనుమకొండ, హయత్‌నగర్‌లో 12.5,..
హైదరాబాద్ 13.1, నిజామాబాద్ 13.4డిగ్రీల ఉష్ణోగ్రతలు
రామగుండం, హకీంపేటలో 14.6, నల్లగొండ, ఖమ్మంలో 15,..
మహబూబ్‌నగర్, భద్రాచలంలో 16డిగ్రీల ఉష్ణోగ్రతలు
-
Nov 21, 2025 06:30 IST
నేడు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
సా.4గంటలకు భారతీయ కళా మహోత్సవం కార్యక్రమానికి హాజరు
రాత్రి రాజ్‌భన్‌లో బస, రేపు ఉ.9:30కు పుట్టపర్తి వెళ్లనున్న రాష్ట్రపతి
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ముర్ము