Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికే ప్రాధాన్యం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:57 PM
మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.
హనుమకొండ, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌కి చిత్తశుద్ది లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శలు చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత అని.. ఈ విషయంలో ఆ పార్టీది కపటనాటకమని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతికత లేదని ఆక్షేపించారు. ఇవాళ(శనివారం) హనుమకొండలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్‌రెడ్డి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీసీలకే కేటాయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చే సీట్లలో ముస్లింలు పోటీచేసే అవకాశం ఉందని.. ఇది బీసీలకు అన్యాయం చేసినట్లు కాదా...? అని ప్రశ్నించారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి.
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన భూసేకరణ చివరి దశలో ఉందని చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు. ఎయిర్‌పోర్ట్‌లు కట్టడమే కేంద్రం బాధ్యత అని.. విమానాలు నడిపేది ప్రైవేటు కంపెనీలేనని తెలిపారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు పోతే మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఈ విషయంపై తాము పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. పరిశ్రమలపై సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News