Home » Telangana Congress
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేతలు ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు..
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
జగిత్యాల కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్టైంది.