Home » Kishan Reddy G
కాంగ్రెస్, పాకిస్థాన్‌లది అక్రమ స్నేహబంధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్ మంత్రులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల ఆధారంగా, మోదీ పాలన అభివృద్ధి మార్గాన సాగుతుందని చెప్పారు
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిరికిపంద చర్యగా మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలబెడతామని హెచ్చరించారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలని, ఆ రెండు పార్టీలకు సూపర్ బాస్ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.
దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మాదికి బలైన ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఆక్రందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల ఆత్మకోసం కన్నీరు తడిపి అంత్యక్రియలు నిర్వహించారు
బీఆర్ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకొంటూ ప్రచారం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని పనులు చేశారని విమర్శించారు.
పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కనీసం అంబర్‌పేట నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.
BJP Strategy: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ హై కమాండ్ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వక్ఫ్ బోర్డుకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నా, వాటి ఆదాయం పేద ముస్లింలకు దక్కడం లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు.
Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.