PM Narendra Modi: స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:43 PM
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తిని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) వ్యాఖ్యానించారు. అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీని ఇవాళ (గురువారం) ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ హైదరాబాద్ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ఇవాళ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. స్పేస్ సెక్టార్‌లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని వివరించారు. జన్ జీ అనుకున్నది సాధించేలా కేంద్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..
Read Latest Telangana News And Telugu News