Share News

Union Minister Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:22 PM

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కామెంట్స్ చేశారు.

Union Minister Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
Union Minister Kishan Reddy

న్యూఢిల్లీ, నవంబర్ 14: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదని... స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని చెప్పారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఓటమిని విశ్లేషించుకుంటామని అన్నారు.


ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామన్నారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని... దీనిపై తాము ఫిర్యాదు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టాంమని.. జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

అవే కాంగ్రెస్‌ను గెలిపించాయ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 03:03 PM