Share News

Kishan Reddy Fires On Congress: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డికి పట్టుకుంది: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Nov 02 , 2025 | 07:08 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.

Kishan Reddy Fires On Congress: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డికి పట్టుకుంది: కిషన్‌రెడ్డి
Kishan Reddy Fires On Congress

హైదరాబాద్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills By Poll)లో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy)కి పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బీజేపీ కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీ (BJP)పై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాయిలాలతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని ఆక్షేపించారు. ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఫైర్ అయ్యారు కిషన్‌రెడ్డి.


ఓట్లు వేయకపోతే పథకాలు ఆపేస్తామని సీఎం బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్‌‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రమంత్రి. సన్నబియ్యం పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఉద్ఘాటించారు. సన్నబియ్యం తామే ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌‌రెడ్డి ఎలా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 08:11 PM