Home » Telangana BJP
బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని రామచంద్రరావు హెచ్చరించారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
తెలంగాణకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్‌షిప్ తీసుకోవచ్చని ఎంపీ అరవింద్ సూచించారు.
తెలంగాణ కులగణన, రిజర్వేషన్లు దేశానికి దశ దిశ చూపుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బీసీ సర్వే మొదలు పెట్టినప్పుడు కొంతమంది అవసరం లేదన్నారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన సర్వే నిదర్శనంగా నిలిచిందని నొక్కిచెప్పారు.
మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని.. వీరుడు ఎక్కడా భయపడడని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటల చెప్పుకొచ్చారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.