Share News

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:41 PM

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): ఇండస్ట్రీయల్ పాలసీ (Industrial Policy)పై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తెచ్చింది పారదర్శకమైన పాలసీ అని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చినది కాదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని గుర్తుచేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని... పాలసీ మార్చేది లేదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనలో తాను భాగమై ఉన్నానని వివరించారు. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీతో తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలనే ఉద్దేశ్యం తప్పా ఏం లేదని విమర్శించారు. అయితే, నల్గొండ డీసీసీ నియామకంపై స్పందించడానికి నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


తమ ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖలో ఎలాంటి కుంభకోణం జరగలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్విప్‌మెంట్ ఎందుకు కొన్నదని ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టులో అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 01:49 PM