Home » Gandhi Bhavan
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మాజీమంత్రి కేటీఆర్ బద్నాం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. పవర్ లేకపోతే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బతకలేక పోతున్నారని దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆరోపించారు.
Renuka Angry At Police: గాంధీభవన్ వద్ద పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది.
AICC PAC Meeting: ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతల వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం మొదలైంది.
Konda Murali: తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీతో కొండా మురళి సమావేశమయ్యారు.
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
TG News: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం ఆదివారం నాడు గాంధీభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ మీనాక్షికి కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేశారు.