TPCC Meeting: గాంధీ భవన్‌లో ఈ రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. సీఎం రేవంత్ దిశానిర్దేశం
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:49 AM
హైదరాబాద్ గాంధీభవన్లో ఈ ఉదయం పదిగంటలకు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేయనున్నారు. పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు (డిసెంబర్ 2) ఉదయం 10 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేయనున్నారు. పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, రాష్ట్రవ్యాప్త కాంగ్రెస్ కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని గ్రామ-మండల స్థాయిలో మరింత బలపరుచుకునే ప్రణాళికలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి