Renuka Angry At Police: గాంధీభవన్‌కు కేడర్.. అడ్డుకున్న పోలీసులు.. రేణుకా చౌదరి ఫైర్
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:06 PM
Renuka Angry At Police: గాంధీభవన్ వద్ద పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది.

హైదరాబాద్, జులై 4: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం (Telangana Congress PAC Meeting) కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేతలు గాంధీ భవన్‌లో ఉండటంతో వారిని కలిసేందుకు కేడర్ క్యూ కట్టింది. ఈ క్రమంలో కేడర్ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్డుకున్న వారిలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Rajya Sabha Member Renuka Chowdhury) స్టాఫ్ ఉన్నారు. దీంతో ఆమె స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి స్టాఫ్‌ను లోపలికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకంటే పోలీసుల హడావుడి ఎక్కువైందంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసహనం వ్యక్తం చేశారు. తమను ఆపుతారా అంటూ పోలీసులపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. సమావేశం మొదలైన వెంటనే పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలుపుతూ పీఏసీ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆపై ఎజెండా ప్రకారం పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకెళ్లారనే దానిపై చర్చించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలని మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ వంటి కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయనే దానిపై రిపోర్టును పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో చదివి వినిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంశంపై కూడా పీఏసీలో చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి
సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్.. ప్రధానంగా వాటిపైనే చర్చ
Read latest Telangana News And Telugu News