Road Accident in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:45 AM
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ కొన్నాయి. ఈ రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు.

మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ (Maripeda) మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ కొన్నాయి. ఈ రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ని పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి కుటుంబానికే..
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
Read Latest Telangana News And Telugu News