Share News

AICC PAC Meeting: తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్.. ప్రధానంగా వాటిపైనే చర్చ

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:08 AM

AICC PAC Meeting: ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతల వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం మొదలైంది.

AICC PAC Meeting: తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్.. ప్రధానంగా వాటిపైనే చర్చ
AICC PAC Meeting

హైదరాబాద్, జులై 4: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) (Telangana Congress PAC Meeting) సమావేశం ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjun Kharge) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా పీఏసీలో ప్రత్యేకంగా చర్చ జరుగనుంది. క్రమశిక్షణ అంశంపై పీఏసీ సీరియస్‌గా చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Congress Incharge Meenakshi Natarajan), తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), పీఏసీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ చీఫ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చారు సీఎం. తన అధికారిక వాహనంలో కాకుండా పార్టీ కార్లో గాంధీభవన్‌కు సీఎం రేవంత్ చేరుకున్నారు.


కాగా.. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కూడా ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆపై మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌తో తాజ్ డెక్కన్‌లో ఖర్గే లంచ్ చేయనున్నారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ సమరభేరి సభలో కాంగ్రెస్ చీఫ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు గ్రామ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలు రానున్నారు.భారత దేశ చరిత్రలో ఆల్ ఇండియా పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షులు.. గ్రామ స్థాయి అధ్యక్షులతో మాట్లాడటం ఇదే ప్రథమం కావడంతో.. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పీసీసీ నేతలు చెబుతున్నారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6:20 గంటలకు బేగంపే విమానాశ్రయం నుంచి ఖర్గేకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.


రోశయ్య విగ్రహం ఆవిష్కరణ

rosaiah-statue.jpg

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Former CM Rosaiah) జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేసిన రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

మెడికల్ స్కాం.. వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..

జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 11:36 AM