Share News

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:53 PM

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Union Minister Kishan Reddy

హైదరాబాద్‌: గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) ఉద్ఘాటించారు. ఇందుకోసం కోల్ గ్యాసిఫికేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ డైవర్సిఫికేషన్, పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, తవ్వకం పూర్తయిన గనుల రీపర్పసింగ్ వంటివాటిపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లో అట్టహాసంగా వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.


ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని ఉద్గాటించారు. బొగ్గు, గనుల రంగం ఆత్మనిర్భరత సాధించాలంటే ప్రపంచస్థాయి ఆలోచనల అమలు అవసరమని చెప్పుకొచ్చారు. ప్రకృతిని, ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తేనే సుస్థిర మైనింగ్ సాధ్యమని తెలిపారు. బొగ్గు, ఇతర మినరల్స్ ఉత్పత్తి, ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికతకు ప్రోత్సాహం అందించడం మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు కిషన్‌రెడ్డి.


ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో.. బాధ్యతాయుతంగా మైన్ క్లోజర్‌పై దృష్టిపెట్టడం కూడా చాలా కీలకమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందుకోసం సింగిల్ విండో సిస్టం తీసుకొచ్చామని అన్నారు. ఇందుకోసం త్వరగా అనుమతులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. గనుల కోసం భూములు ఇస్తున్న వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు మోదీ సర్కార్ కృషిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, పరిశోధనలకు, అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా ఎక్స్‌ప్లొరేషన్‌ను మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ సంస్థలను కూడా ఎక్స్‌ప్లొరేషన్ చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి కుటుంబానికే..

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 01:04 PM