RGUKT: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారి జాబితా విడుదల
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:54 AM
బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా శుక్రవారం విడుదల కానుం ది.

బాసర, జూలై 3 (ఆంధ్రజ్యోతి): బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా శుక్రవారం విడుదల కానుం ది. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ. గోవర్దన్ ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం ఈసారి 20,258 దరఖాస్తులు వచ్చాయి.
బాసర క్యాంప్‌సలో 1500 సీట్లతో పాటు ఈ ఏడాది కొత్తగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌సలో 180 సీట్లు కలిపి.. మొత్తం 1680 మంది విద్యార్థులకు అధికారులు ప్రవేశం కల్పించనున్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.rgukt.ac.in లో చూడొచ్చని అధికారులు తెలిపారు.