Mynampally: ఆ జర్నలిస్ట్ చనిపోవడానికి కారణం కేటీఆర్.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:38 PM
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మాజీమంత్రి కేటీఆర్ బద్నాం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. పవర్ లేకపోతే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బతకలేక పోతున్నారని దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆరోపించారు.

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి మీడియా పేరు మార్చుకోవాలని చెప్పడానికి మాజీమంత్రి కేటీఆర్ (KTR) ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao) ప్రశ్నల వర్షం కురిపించారు. ఏం చేయడానికి భారత రాష్ట్ర సమితి పెట్టారు..? అని నిలదీశారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కేటీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే కేటీఆర్, హరీష్‌రావు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు మైనంపల్లి హన్మంతరావు.
బావ, బామ్మర్థుల బట్టలు విప్పుతానని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ రెడ్‌బుక్ పెట్టుకొని ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం, జులై19) గాంధీభవన్‌లో మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటీఆర్ బద్నాం చేశారని విమర్శించారు. పవర్ లేకపోతే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బతకలేక పోతున్నారని దెప్పిపొడిచారు. కేటీఆర్ తన కంటే జూనియర్, బచ్చాగాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను సిరిసిల్లాలో చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. సెటిలర్స్‌ను కాపుడుకుంటానని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు మైనంపల్లి హన్మంతరావు.
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కి 24 సీట్లు ఇచ్చిన సెటిలర్స్‌పై కేటీఆర్‌కి అంత కోపం ఎందుకని నిలదీశారు. లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ తన జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు. కేటీఆర్ బాసన్లు తోముకోవాలని ఎద్దేవా చేశారు. మా జోలికి వస్తే మీ బావపై ఎటాక్ చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆరోపించారు. కేటీఆర్ ది నరం లేని నాలుక అని ఆక్షేపించారు మైనంపల్లి హన్మంతరావు.
కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాస్తా..
‘జర్నలిస్ట్ స్వేచ్ఛ చనిపోవడానికి కారణం కేటీఆర్. ఆయన ప్రవర్తనలో మార్పు లేదు.. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాస్తాను. గడప గడపకి నేను రాసే పుస్తకాన్ని ఇచ్చే బాధ్యత నాదే. భార్య, భర్తలను కేటీఆర్ విడదీశాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కి లేదు. ఏపీలో వైసీపీ నేతలు బయపడి విదేశాలకు, వేరే రాష్ట్రాలకు పారిపోయారు. మూసీ చుట్టూ ఉన్న అక్రమ ఇళ్లు కూలగొడుతాం.. అడ్డు రావద్దని కేటీఆర్ చెప్పాడు. పైసలు తీసుకొని పదవులు ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు మోసం చేశారు. కేటీఆర్ జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు వస్తాయి. హరీష్‌రావు, కేటీఆర్‌లను అరెస్ట్ చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావట్లేదు. కేటీఆర్‌కి ఆయన భాషలో చెబితేనే అర్థం అవుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ పిలుపునిస్తే లక్షలాది మంది శ్రేణులు రోడ్లపైకి వస్తారు’ అని మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్ కాదు.. ప్రమోషన్ శాఖ
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి
Read latest Telangana News And Telugu News