Home » KTR
రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకూ విస్తరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్‌ఎస్ అంటూ మండిపడ్డారు.
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. బీసీలకు ముఖ్యమంత్రి క్షమాపన చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
ఈనెల 27వతేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.
9,292ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్షన్‌కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.