Share News

BRS: 27న గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం

ABN , Publish Date - Nov 26 , 2025 | 07:29 AM

ఈనెల 27వతేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.

BRS: 27న గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం

- హాజరుకానున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ భవన్‌లో ఈనెల 27న మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Sanathnagar MLA Talasani Srinivas Yadav) తెలిపారు. సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్‌ 29న దీక్షా దివస్‌ను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.


city3.2.jpg

ఈ సమావేశంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌(Secunderabad, Hyderabad) పార్లమెంట్‌ నియోజకవర్గాలు, కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనాలని మంగళవారం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 07:29 AM