Share News

Sridhar Babu: ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ అవాస్తవాలు చెప్పారు.. మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

ABN , Publish Date - Nov 21 , 2025 | 07:06 PM

ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్షన్‌కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sridhar Babu: ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ అవాస్తవాలు చెప్పారు.. మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
Minister Sridhar Babu

హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక ఆరచకానికి పాల్పడిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనలో ఇంకా మార్పు రావడం లేదని మండిపడ్డారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ అవాస్తవాలు చెప్పారని ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు.


బీఆర్ఎస్ హయాంలో జీవోలు..

లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవోలు తెచ్చారని గుర్తుచేశారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పే 30శాతం భూమి విలువ కాదని... కేవలం కన్వర్షన్‌ ఫీజు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఫ్రీ హోల్డ్‌కు... లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తెచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేస్తున్నామని వివరించారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. కన్వర్షన్‌కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు.


బెదిరింపులకు పాల్పడుతున్నారు..

‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్‌ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరిశ్రమలు కావాలి అనుకునే వాళ్లే దరఖాస్తు చేసుకోవచ్చు. కేటీఆర్ చెప్పిన పేర్లు కలిగిన వాళ్లు ప్రభుత్వంలో లేరని.. వారితో ఎంవోయూ చేసుకున్నట్లు నిరూపిస్తే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ అవ్వకుండా బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. సొంత భూములు ఉన్న వాళ్లు కన్వర్షన్‌ చేసుకోవచ్చు. కేటీఆర్ గాలి మాటలు మానుకోవాలి. కన్వర్షన్‌ వల్ల రూ.4 వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


కేటీఆర్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు..

‘ఫ్రీ హోల్డ్, లీజ్ ల్యాండ్ మధ్య పొంతన లేకుండా కేటీఆర్ మాట్లాడారు. అర్థవంతమైన చర్చ మొదలు పెడితే సమాధానం చెప్పొచ్చు కానీ అవాస్తవాలు ప్రచారం చేయడంలో మీ తర్వాతే ఎవరైనా... ఇష్టారాజ్యంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి గత ప్రభుత్వం ఒక గ్రిడ్ పాలసీ తెచ్చింది. వారు అప్పుడు చేసిన పనులన్నీ బయటకు తీయాల్సి ఉంది. అప్పుడు కన్వర్షన్‌ ఫీజు తీసుకుని పాలసీ తెచ్చారు.. మరి ఇందులో ఎన్ని లక్షల కోట్ల మతలబు ఉందో కేటీఆర్ చెప్పాలి. ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర గౌరవం గురించి ఆలోచించి భయాందోళనలు సృష్టించలేదు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆదాయ వనరులకు గండి పెట్టాలని బీఆర్ఎస్ చూస్తోంది’ అని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.


బీఆర్ఎస్‌కు పగలే చుక్కలు..

‘పరిశ్రమలు కావాల్సిన వారు ఫీజు కట్టుకుంటారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి. కేటీఆర్ చెప్పిన పేర్లు ఉన్న వారు ప్రభుత్వంలో లేరు. ఎవరితో ఒప్పందం చేసుకున్నామో ఆధారాలు బయట పెట్టండి.. మేం ఎలాంటి చర్యలు తీసుకుంటామో చూడండి. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు పెంచాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మా ప్రభుత్వం హైదరాబాద్‌ని గ్లోబల్ సిటీగా చేయాలని చేస్తున్న ఆలోచనలని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు’ అని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు

బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన హీరోయిన్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 07:38 PM