Home » Duddilla Sridarbabu
మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే నగరాభివృద్ధికి రూ.15వేల కోట్లకు పైగా నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన కంపెనీకి మూసీ డీపీఆర్ తయారీ బాధ్యత అప్పగించారని.. ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ శాసనసభలో కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలంటే కేటీఆర్‌కు చులకనన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు.
ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్షన్‌కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.