Minister Sridhar Babu: మంత్రుల మధ్య వివాదాలు లేవు: శ్రీధర్ బాబు
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:29 PM
మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీన్సియర్ కాంగ్రెస్ వాదినని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీనియర్ కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. తనకి నీచ రాజకీయం చేసే శక్తి లేదు.. యుక్తి అంతకన్నా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పార్టీని నమ్ముకొని ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇవాళ(బుధవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. పార్టీని నమ్ముకోకుండా అటు, ఇటు పోయే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.
తాను పార్టీని బలోపేతం చేసే వ్యక్తినని చెప్పుకొచ్చారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే బీఆర్ఎస్ నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితా తయారు చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది రామరాజ్యమని అభివర్ణించారు. తెలంగాణలోని ప్రజలందరూ రామరాజ్యాన్ని కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాగంటి సునీతని అవమానిస్తారా.. మంత్రులపై బీఆర్ఎస్ ఫైర్
బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చింది: ఆర్.కృష్ణయ్య
Read Latest Telangana News And Telugu News